Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అహోబిలంలో భారీ అగ్నిప్రమాదం.. రూ.50 లక్షల ఆస్తి నష్టం

Ahobilam massive fire accident causes 50 lakh property loss
Advertisement
  • నంద్యాల జిల్లా దిగువ అహోబిలంలో ఘటన
  • ఆదివారం అర్ధరాత్రి ఆరు దుకాణాలు పూర్తిగా దగ్ధం
  • షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమిక అంచనా
  • గ్యాస్ సిలిండర్లు తొలగించడంతో తప్పిన పెను ముప్పు
Advertisement
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం దిగువ అహోబిలంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో ఆరు దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న బీగల ఆంజనేయస్వామి గుడికి వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో మూడు బొమ్మల దుకాణాలు, ఒక శీతల పానీయాల దుకాణం, రెండు హోటళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితుల అంచనా ప్రకారం సుమారు రూ.50 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమీపంలోని హోటళ్లలో ఉన్న గ్యాస్ సిలిండర్లను సకాలంలో బయటకు తరలించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement
Ahobilam
Nandyal district
Fire accident
Short circuit fire
Ahobilam temple shops
Andhra Pradesh news

More Telugu News